Take a fresh look at your lifestyle.

ఎఫ్2 ఫ్రెషర్స్ ఫ్యూజన్ – మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాంగణంలో బుధవారం ఎఫ్ 2 ఫ్రెషర్స్ ఫ్యూజన్ పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత విద్యార్థులు, కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు.విద్యార్థులు పాటలు, డ్యాన్సులు, నాటికలు, వినోదాత్మక ఆటలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో కళల క్షేత్రంగా అందరినీ ఆకట్టుకుంది. ప్రిన్సిపాల్ రజిత రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మానస కుటుంబంలో ఓ ముఖ్య భాగంమన్నారు. కొత్త విద్యార్థులకు పాతవాళ్లు ఇచ్చిన ఆత్మీయ స్వాగతం ఎంతో ప్రశంసనీయమని, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచటమే కాక, స్నేహబంధాలను బలోపేతం చేస్తాయ న్నారు.ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, డైరెక్టర్లు శ్రీధర్ రావు ,హరిచరణ్ రావు,మౌనిక రావులు వేడుకల్లో పాల్గొని పిల్లల ప్రతిభను ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.