ఘనంగా సన్మానించిన ఐ. ఎన్. టి. యు. సి తాలూకా కమిటీ.
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లాఅచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైనందుకు ఐ. ఎన్. టి. యు. సి తాలూకా కమిటీ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పుట్టపాక మహేంద్ర నాథ్ జయంతి ఉత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు అభిమానులు కూడా సన్మానించారు. ఐఎన్టియుసి తాలూకా కమిటీ అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ లో ఉపాధ్యక్షులుగా అవకాశం వచ్చినందుకు ఐఎన్టియుసి హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎం. ఎల్. ఏ. వంశీకృష్ణ భవిష్యత్తులో మరిన్ని గొప్ప గొప్ప పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు అందరికీ పార్టీలో కష్టపడ్డ వాళ్లందరికీ మంచి మంచి పదవులు సమయాన్నిబట్టి కచ్చితంగా వస్తుంటాయి, ఈరోజు రాష్ట్ర కమిటీ లో డాక్టర్ వంశీకృష్ణ కి అవకాశం ఇచ్చినందుకు ఐఎన్టీయూసీ తరుపున పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు చందు నాయక్, టౌన్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు గౌస్ పాషా, అచ్చంపేట మండల ఉపాధ్యక్షులు మౌలానా, రాములు, వెంకటేష్, మహేష్ రాజు, రఘు, నగేష్, శ్రీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.