ముద్ర,వీపనగండ్ల: అర్హత గల ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య,పౌష్టికాహారం అందుతుందని ఎస్సై కే రాణి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఎమ్మార్సీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్ఐ రాణి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదువుకోవాలని పాఠశాలలో నిర్వహించే వార్షికోత్సవాల పట్ల విద్యార్థుల్లో నమ్మకం విశ్వాసాన్ని నింపుతాయని,ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల తోడ్పాటు ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.విద్యార్థులకు చదువులు ఎంత ముఖ్యమో ఆటపాటలు కూడా అంతే ముఖ్యమని వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.ఇట్టి కార్యక్రమంలో హెచ్ఎం సాయిలత, ఉపాధ్యాయులు రంజిత్ గౌడ్, భారతి, దేవేందర్, రవికుమార్ రాజ స్వప్న, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.