Take a fresh look at your lifestyle.

స్పెషల్ డ్రైవ్ లో 150 మొబైల్ ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి గురైన 150 మొబైల్ ఫోన్లను ( సుమారు 25 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలని, SIM కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త SIM తీసుకోవాలని అన్నారు. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల IMEI వివరాలు CEIR వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులబంగా దొరికే అవకాశం ఉన్నదని అన్నారు.జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, 12 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. గత (7) రోజులలో ఈ టీం అధికారులు 150 ఫోన్లను, ఇప్పటి వరకు ఈ టీం అధికారులు 627 ఫోన్ లను రికవరీ చేయడం జరిగిందని అన్నారు. CEIR పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 3551 ఫోన్ లను రికవరీ చేయడం, బాధితులకు అందజెయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా 150 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుందని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి RSI బాలరాజ్ ని సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి తీసుకోవాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.