ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లాలో అక్రమ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు, ఈరోజు నుండి ప్రారంభమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐపీఎల్‌ను కేవలం ఆటగా మాత్రమే ఆస్వాదించాలని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ బెట్టింగ్‌కు పాల్పడవద్దని కొండాపూర్ ఎస్సై హెచ్చరిస్తున్నారు. ఇటీవల యువకులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు ఆకర్షితులై పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడికి గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. చిన్నగా ప్రారంభమైన బెట్టింగ్ అలవాటు పెద్ద సమస్యగా మారి, చివరకు నేరాలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారు ఆన్లైన్లో ఏమి చూస్తున్నారు, ఏయే యాప్స్ వాడుతున్నారు అనే విషయాలను గమనించాలని సూచించారు.
ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు సమాచారం ఉంటే 8712656746 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.