Take a fresh look at your lifestyle.

వరికి మద్దతు ధర పెంచిన ప్రధాని నరేంద్ర మోడి

 

రైతు పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడి- తుంగతుర్తి సర్పంచ్  మల్లెపాక సాయిబాబు

ముద్ర, తుంగతుర్తి…..

దేశంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రాక ముందు 1400 రూపాయలుగా ఉన్న వరి ధాన్యం ధర, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత నాటి నుండి నేటి వరకు 2441 రూపాయలకు వరి మద్దతు ధర అంచలంచెలుగా పెరిగిందని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు అన్నారు. గురువారం తుంగతుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ వరి మద్దతు ధర పెంచుతూ 2.6 లక్షల కోట్లు కేటాయించడం హర్షించ తగ్గ విషయం అని, ప్రధాని నరేంద్ర మోడీ రైతు పక్షపాతి అని అనడానికి ఇది చక్కని ఉదాహరణ అని అన్నారు .
వరితో పాటు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పెసలకు మద్దతు ధర పెంచడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎరువులపైన వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తుందని అని అన్నారు . ప్రధాని నరేంద్ర మోడీ తోనే దేశంలో రైతు రాజ్యం సాధ్యమని అన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం కి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నారు .కల్లాలలోని వడ్లను వెంటనే కాంటాలు వేసి తరలించాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.