Take a fresh look at your lifestyle.

రైల్వే రంగంప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని రైల్వే రంగం జిల్లా నాయకులు దాసరి పాండు అన్నారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ ముందు రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి కార్మిక వర్గం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు శక్తులకు సంపదను సృష్టించే ప్రభుత్వ రంగాలు రైల్వే, ఎల్ఐసి, పోస్టల్, టెలికాం లాంటివి అప్పజెప్పడానికి చూస్తుందన్నారు. 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గం పాల్గొనాలని వారన్నారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ , పట్టణ కన్వీనర్ గంధ మల్ల మాతయ్య, నాయకులు గురువయ్య, ఎల్లేష్, కోటేష్, రత్నం, లక్ష్మీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.