కోరుట్ల/మెట్ పల్లి, ముద్ర:- రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం చింతలపేట వద్ద జరిగింది. పోలిసుల అందించిన వివరాల ప్రకారం వేములకుర్తి గ్రామానికి చెందిన బర్మ నాగేష్ 30 శుక్రవారం రోజు మెట్ పల్లి మండలం చింతలపేట గ్రామంలోని బంధువుల వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో సాయంత్రం సుమారు 8 గం సమయంలో తన ద్విచక్ర వాహనం పై వేములకుర్తి బయలుదేరాడు. ఎదురుగా యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన యండి సోషియన్ 19 అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పై అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి డీకొట్టడం తో నాగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని మేనమామ గాజనవేని రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మెట్ పల్లి ఎస్సై పబ్బా కిరణ్ కుమార్ తెలిపారు.
గ్రామంలో అందరితో కలగొలుపు గా ఉండే బర్మ నాగేష్ మృతి తో వేములకుర్తి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఆన్లైన్ సెంటర్ నిర్వహించే నాగేష్ క్రికెట్ ఆటలో నైపుణ్యం కనబరిచేవాడని, గ్రామ సమస్యలు, వాటి పరిష్కారం విషయాన్ని తోటి మిత్రులతో కలసి కృషి చేసే నాగేష్ లేడు అన్న వార్త గ్రామన్ని శోకసముద్రంలో నింపింది.