Take a fresh look at your lifestyle.

తుంగతుర్తి మండలం లో ఇద్దరు వ్యక్తుల మృతి

 

ముద్ర, తుంగతుర్తి …
తుంగతుర్తి మండల పరిధిలో గురువారం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు, సూర్య తండా ఆవాస గ్రామం గుట్ట కింది తండా కు చెందిన గుగులోతు బిక్షం(57) ఎస్సారెస్పీ పిల్ల కాలువలో చనిపోయి ఉన్నాడని తెలిపారు, మరొక వ్యక్తి జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండా గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన వస్త్రం తండాకు చెందిన భూక్య పంతులు(50) తన కుటుంబంతో మండల పరిధిలోని మానాపురం గ్రామంలో వివాహ కార్యక్రమానికి వెళ్లి అక్కడ భార్యతో గొడవపడి మద్యం మత్తులో తిరిగి వస్తూ బాపన్ భాయ్ తండా దగ్గర చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు అని తెలిపారు, మృతుల కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.