జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తకాలను క్యాటలాగ్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్ చిస్తి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉన్న అన్ని పుస్తకాలను క్యాటలాగ్ చేసి అందుబాటులో ఆర్డర్ లో ఉంచడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్ చిస్తి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్యాటలాగ్ చేసిన అన్ని రకాల పుస్తకాలను ప్రతి ఒక్క రీడర్ కాంపిటీషన్ పరంగా గాని అన్ని రకాల పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క పాఠకుడు వినియోగించుకునే విధంగా పుస్తకాలను సమకూర్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది జంపయ్య, రుకోధర్, కావ్య, నీలం శ్రీను పాఠకులు పాల్గొన్నారు.