Take a fresh look at your lifestyle.

పేదలకు సన్న బియ్యం పంపిణి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  • ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్.

గొల్లపల్లి, ముద్ర : పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల తరుపున ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్ ధన్యవాదాలు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో ఆదివారం సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన భీమ సంతోష్ స్థానిక నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,దేశంలొనే సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమేనని,దేశ చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప పథకం ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందని అన్నారు. గతంలో ధనికులు సన్న బియ్యం తింటే, నిరుపేదలు మాత్రం దొడ్డు బియ్యం తినేవారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బేరా కిషోర్,కాంగ్రెస్ నాయకులు దుర్గం చంద్రయ్య, బండి దేవేందర్,సిద్దెంకి రమేష్,గంగారెడ్డి,కళ్లెం రాజన్న,బాలలింగు,గొట్టి పలుకుల తిరుపతి, బండారి గంగాధర్, లంబ లస్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.