Take a fresh look at your lifestyle.

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు.. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక వైయస్సార్ గార్డెన్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. రంజాన్ పండుగను శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.