Take a fresh look at your lifestyle.

విద్యార్థుల ప్రాథమిక విద్యా దశలోనే బలమైన పునాది వేయాలి

  • పాఠశాల తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు క్రియాశీలకంగా వ్యవహరించాలి.
  • డిఇఓ రమేష్ కుమార్.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం చారగొండ పాఠశాలను డిఇఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ మీటింగ్ కు వచ్చిన డీఈవో రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రాథమిక విద్యా దశలోనే బలమైన బోధన జరిగితే, విద్యార్థులు ఉన్నత స్థాయిలో సైతం విజయం సాధించగలుగుతారని, అంతేకాకుండా, వారు సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని, ఉపాధ్యాయులు తమ భోజనం పద్ధతుల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. శుక్రవారం చారకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి డిఈవో రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఇస్తున్న శిక్షణ తరగతులను డిఇఓ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో విద్యా సామర్ధ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు 100% కృషి చేయాలని డిఇఓ రమేష్ కుమార్ సూచించారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో సమర్థవంతమైన బోధనా పద్ధతులను అవలంబించి, తరగతి, స్థాయిల వారిగా విద్యార్థుల అవసరాలు, ఆసక్తులను గుర్తించి, ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని నూతన పద్ధతుల ద్వారా బోధనను ఆకర్షణీయంగా చేయాలని సూచించారు.ఉత్సాహవంతమైన వాతావరణం, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచే బోధన శైలి అవలంబించాలని కోరారు.అంతకుముందు సిరసనగండ్ల ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీకి చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు .విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులను డిఈవో ఆదేశించారు.అనంతరం చారకొండ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిసరాలను డిఇఓ పరిశీలించారు. రుచికరమైన భోజనాన్ని ఆరోజు వారి మెనూ ప్రకారం విద్యార్థులకు అందజేయాలని పరిశుభ్రమైన వాతావరణం లో భోజనం వండాలని సూచించారు.పదో తరగతి గదిలో విద్యార్థులతో డిఇఓ మాట్లాడారు.పదో తరగతి పరీక్షల గురించి చివరి రెండు నెలల్లో ప్రణాళికలు రచించడం కాకుండా మొదటి నుండే ప్రణాళిక బద్ధంగా పిల్లలను చదివించి పరీక్షలకు సమాయత్తం చేయటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులకు సూచించారు. తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి విద్యార్థి అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం చేయాలని డిఇఓ రమేష్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.