Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగవద్దు కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీలు

ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.
అల్లాదుర్గం మండలం గడి పెద్దాపురం గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ధాన్యం రాశులు పరిశీలించి,,అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచి వెంట వెంటనే ధాన్యం అన్ లోడింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని ఆదేశించారు. పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వెంట అధికారులు నిత్యానంద్, జగదీశ్వర్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.