Take a fresh look at your lifestyle.

జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్:
జన గణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.
బుధవారం పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ, అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలోని జనగణన 2027 ను తహాసిల్దార్ తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ నిర్వహించబడుతోందని, కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికి ఇప్పుడు 16వ జన గణన చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలను ఇవ్వాలని, ఎవరూ సమాచారం దాచకూడదని స్పష్టం చేశారు.
జనగణన రెండు దశల్లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి దశగా హౌస్ లిస్టింగ్ చేపట్టి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలపై వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఇందులో నీటి కనెక్షన్, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్, ఫోన్, ఇంటర్నెట్, తరచుగా వినియోగించే ఆహార ధాన్యాలు వంటి అంశాలు నమోదు చేస్తారని, vగృహ వివరాలు సేకరించి డిజిటల్‌గా భద్రపరుస్తామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.