Take a fresh look at your lifestyle.

వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

కోరుట్ల, ముద్ర: మహిళా దినోత్సవ సందర్భంగా కోరుట్ల వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు వేడుకలను వాసవి కళ్యాణ భవనంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి క్లబ్ గవర్నర్ గట్టు రాణి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా మహిళలు వాసవి అమ్మవారి పారాయణం చదివారు.ఈ సందర్భంగా గట్టు రాణి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. క్లబ్ సభ్యులు మాట్లాడుతూ స్త్రీమూర్తిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు.స్త్రీ తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటు, భార్యగా భాగోగులు చూస్తూ,సేవకురాలిగా పని చేస్తూ,కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుందని,మహిళ గొప్పతనాన్ని చాటి చెప్పారు.మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను పునః సమీక్షించి దేశం కోసం జ్వలించిన జ్వాలామణుల త్యాగాల గురించి తెలియజేశారు.ఇంట్లో స్త్రీని ఎలా గౌరవిస్తారో బయట మహిళలను గౌరవించాలన్నారు.అనంతరం ఆటలు, పాటలు, అంత్యాక్షరి, క్విజ్ పోటీలు,వన్ మినిట్ గేమ్ షో లను నిర్వహించి గెలిచిన వారికి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు నీలి గాయత్రి,కార్యదర్శి ముత్యపు మంజుల, కోశాధికారి గుడిసె శివజ్యోతి,ఉపాధ్యక్షురాలు మోటూరి అర్పణ,మంచాల రాధ,డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నీలి లక్ష్మి,జోనల్ చైర్మన్ శ్రీపతి వాణి, క్లబ్ సభ్యులు, వాసవి మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.