ఎలక్ట్రికల్ స్టోర్స్, 33/11 కేవీ సబ్ స్టేషన్, కొత్త రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం
ముద్ర,, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ మండలం ధారూర్ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్రేపల్లి లో రూ. 3.36 కోట్లతో నిర్మించే వికారాబాద్ జిల్లా ఎలక్ట్రికల్ స్టోర్స్ కు శంఖుస్థాపన చేశారు. వికారాబాద్ మండలం జైదుపల్లి లో రూ. 2.98 కోట్లతో నిర్మించే 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ధారూర్ మండలం నాగుసాన్ పల్లిదో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం. ధారూర్ మండల కేంద్రంలోని బస్ స్టాప్ ప్రాంగణంలో రూ. 24 లక్షల నూతన సిసి రోడ్డు ప్రారంభించారు. ధారూర్ మండల కేంద్రంలోని కాలనీలో సిసి రోడ్డు, సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ. 40 లక్షలతో శంకుస్థాపన. ధారూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ధారూర్ మండలానికి సంబంధించిన 37 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల చెక్కుల పంపిణీ చేశారు. ధారూర్ రైతు వేదికలో జరిగిన సభలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గురువారం 37 కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచే ఉండడం, నేను స్పీకర్ హోదాలో ఉండడంతో వికారాబాద్ కు నిధులు ఎక్కువగానే వస్తున్నాయి. వికారాబాద్ నియోజకవర్గంలో 600 కోట్లతో కొత్త రోడ్లు వేయిస్తున్నాను.
గత ప్రభుత్వం పదేళ్ళలో కోట్ పల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కోట్ పల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు 90 కోట్లు మంజూరు చేయించాను, పనులు జరుగుతున్నాయి.
నాగసమందర్ వద్ద కోట్ పల్లి వాగుపై కొత్త హైలెవల్ బ్రిడ్జికి 27 కోట్ల యాబై లక్షల రూపాయలు మంజూరు చేయించాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరంటు, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ అయ్యింది. గత ప్రభుత్వం పదేళ్ళలో డబుల్ బెడ్ రూం ఇళ్ళులు రాలేదు, కానీ ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై, నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. ఇల్లు లేని పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు, ఆర్ధిక పరిస్థితులు అస్తవ్యస్తం అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడు కాబట్టి గత ప్రభుత్వం చేసిన అప్పుకు నెలకు రూ. 6, 500 కోట్ల మిత్తి చెల్లిస్తూ మరోపక్క అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
ఈ అప్పులు లేకపోతే తులం బంగారం ఇచ్చేవాళ్ళం, పెన్షన్లు పెంచేవాళ్ళం, మహిళలకు 2,500 వచ్చేవి. అయినప్పటికీ వచ్చే ఆరు నెలలు తరువాత ఇవన్నీ అమలవుతాయి.
ప్రజాప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకాలు అందుతున్నాయి.