- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందచేశారు. మొదటి బహుమతి పెద్దపల్లి పోలీస్ టీంకు రూ.50 వేలతో పాటు ట్రోఫీ, రెండో బహుమతి వెటర్నరీ డాక్టర్స్ టీం వారికి రూ. 25 వేలతో పాటు ట్రోఫీని అందజేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లైఫ్ లో బిజీగా ఉండే ఉద్యోగులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మంచి ఆలోచన అని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఐఎంఏ ప్రతినిధులను అభినందించారు. పదేళ్లకు ఒకసారి ట్రెండ్ చేంజ్ అవుతుందని, ప్రస్తుతం బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా మారిందని అన్నారు. పోటీలలో గెలుపు ఓటములు సహజమని రన్నర్ అప్ గా నిలిచిన అగ్రి వెటర్నరీ టీం రాబోయే పోటీలలో విన్నర్ అఫ్ గా నిలిచేందుకు కృషి చేయాలన్నారు. పోలీసులు ఉద్యోగరీత్యా ఫిట్నెస్ గా ఉంటారని, వారు విన్నర్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదని ఆయన చమత్కరించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి జీ.కృష్ణ, పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు ప్రవీణ్ కుమార్, సుబ్బారెడ్డి, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్నకుమారి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, డీఏవో ఆదిరెడ్డి, ఏడిఏ శ్రీనాథ్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమాకాంత్, కార్యదర్శి డాక్టర్ ప్రణీత్, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
