రామకృష్ణాపూర్, ముద్ర : రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, పేదలకు సన్న బియ్యంతో ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు అన్నారు.మంగళవారం పట్టణంలోని వివిధ రేషన్ డీలర్ దుకాణాల వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు కోట్ల పది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.మాజీ చైర్ పర్సన్ జంగం కళ,మూడో వార్డు మాజీ కౌన్సిలర్ కొక్కుల స్రవంతి -సతీష్,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.