Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఎంపీడీవో రామకృష్ణ….

 

కోరుట్ల, ముద్ర;
ఏప్రిల్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా
గ్రామసభల ముఖ్య లక్ష్యాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై చర్చించడం, లబ్ధిదారుల అభిప్రాయాలను స్వీకరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రగతి ప్రణాళిక రూపకల్పన కోసం గ్రామస్థాయి అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడం, పారదర్శకత జవాబు దారితనాన్ని నిర్ధారించడం గ్రామసభల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుధ్య సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ఇప్పటికే సాధించిన విజయాలను ప్రజల ముందుంచి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీవో రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.