Take a fresh look at your lifestyle.

పలు వివాహ, శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూర్.

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి పలు వివాహ, శుభ కార్యల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్వీఆర్  గార్డెన్స్ లో రాఘవపూర్ వాస్తవ్యులు వడ్డే జగదీష్ వివాహ వేడుకలో, వెంకోబ గార్డెన్ లో కొర్విచేడ్ వాస్తవ్యులు పాండురంగా రెడ్డి కుమారుని వివాహ వేడుకలో, వినాయక కన్వెన్షన్ లో మాజీ ఏఎంసి చైర్మన్ రాము నాయక్ కుమార్తె వివాహ వేడుకలో, గగ్రాని కళ్యాణమంటపంలో గొట్టిక కలాన్ వాస్తవ్యులు సుధాకర్ గౌడ్ వివాహ వేడుకలో, కింగ్ ప్యాలస్ లో దేవనూర్ వాస్తవ్యులు రమాదేవి వివాహ వేడుకలో, క్లాసిక్ గార్డెన్స్ లో రెడ్డి ఘనపూర్ వాస్తవ్యులు తలారి వెంకటప్ప కూతురి వివాహ వేడుకలో, సల్ల గార్డెన్స్ లో జినుగుర్తి వాస్తవ్యులు మోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో, మినీ భూకైలాస్ లో వీరమని కూతురి వివాహ వేడుకలో, భవాని ఫంక్షన్ హాల్ లో రాంపూర్ తండా వాస్తవ్యులు గణేష్ వివాహ వేడుకలో, మిట్టబాస్పల్లి వాస్తవ్యులు శ్రీశైలం వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, మురళి గౌడ్, సుదర్శన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.