మన్ననూరు, బ్రహ్మగిరి జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలి TUWJ IJU నాగర్ కర్నూల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ సురేష్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
మన్ననూరు, బ్రహ్మగిరి సెంటర్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజేఐజేయూ (TUWJ–IJU) ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీ లకు వినతి పత్రాలు సమర్పించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
అక్రిడేషన్ కమిటీ ద్వారా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, కార్యదర్శి సురేష్ కుమార్ కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర అక్రిడేషన్ కమిటీ చైర్మన్‌కు కూడా యూనియన్ తరఫున లేఖలు పంపినట్లు వెల్లడించారు. డిపిఆర్ఓ ద్వారా కమిషనరేట్‌కు పంపిన ఆ లేఖల ఫలితంగా అక్రిడేషన్ ప్రక్రియను రంగారెడ్డి జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు మార్చినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ తరఫున జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.