రంజాన్ నమాజ్ కు ముస్తాబైన ఈద్గా లు -నేడే ఈద్ ఉల్ ఫితర్ -నాగర్ కర్నూల్ ఈద్గా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
రంజాన్ ప్రత్యేక నమాజ్ కోసం ఈద్గా లు ముస్తాబయ్యాయి. ఈదుల్ ఫితర్ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు నగల ఈద్గా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగే ఏర్పాట్లను వక్స్ బోర్డు పర్యవేక్షణలో జరుపుతున్నారు. ఇదిగా వద్ద పెయింటింగ్ తో పాటు పెండాల్ వేయడం నీటి వసతి వంటివి ప్రతి ఏడాది ఆనవాయితీగా మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాతో పాటు మండలాలు గ్రామాలలోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్ కోసం మస్జీద్ , ఈద్గా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ ఈద్గా లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక నమాజ్ ఉంటుంది.