Take a fresh look at your lifestyle.

జిల్లా కోర్టు భవన సముదాయాన్ని త్వరగాపూర్తి చేయాలి : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐ లు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : 

జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు భవన సముదాయాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐ లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొల్లేపల్లి కుమార్, కోశాధికారి బోడ్డు కిషన్, బృందం కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించి  మాట్లాడారు. జిల్లా కోర్టు భవనం లో ప్రిన్సిపల్ జెసి జె, అడిషనల్ జెసిజె భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఈ వర్షాకాలం వస్తే అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నడవడానికి వీలు లేకుండా జడ్జిలు, సిబ్బంది పనిచేయలేని పరిస్థితి ఉందన్నారు. వెంటనే నూతన జిల్లా కోర్టు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు. జిల్లాలోని రామన్నపేట నాలుగు కోట్ల భావన సముదాయం పనులు ప్రారంభమయ్యాయని పనులను వేగవంతం చేయాలని వారు కోరారు. ఆలేరు, చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జ్  కోర్టులకు వెంటనే ఫైనాన్స్ అప్రూవల్ చేసి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలకు శంకుస్థాపన చేయాలని వారు కోరారు. యాదగిరిగుట్ట కోర్టుకు వెంటనే స్థలాన్ని కేటాయించి ఫైనాన్స్ అప్రూవల్ చేయాలని వారు కోరారు.give me tags,permlink ,with,comas in english

Leave A Reply

Your email address will not be published.