* సిద్దిపేట పై ప్రేమ ఉంటే 1070 కోట్ల నిధులు పనులు వెనక్కి తేవాలి
* ఎప్పుడు చూసిన కొడంగల్ ధ్యాసనే…
* నువ్వు తెలంగాణ కు ముఖ్యమంత్రి వా కొడంగల్ కా…
రేవంత్ రెడ్డి పై మండిపడ్డ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
బి ఆర్ ఎస్ శంకుస్థాపన చేస్తే సీఎం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడని నిన్న నువ్వు ప్రారంభించిన అన్ని పనులకు నిధులు ఇచ్చిన ఘనత ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వానిదే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి ఒరగబెట్టింది ఏమీ లేదని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయం లో సీనియర్ నాయకులు గుండు భూపేష్, కురా మాణిక్య రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి, సారయ్య, ఎల్లారెడ్డి, లింగం గౌడ్ సోమోరెడ్డి చిన్నా లతో కలసి మీడియా తో మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతు.300 ఎకరాలకు 62 ఎకరాలకు తేడా తెలియని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. కలెక్టరేట్ పక్కన వెటర్నరీ కాలేజీ కోసం వేసిన పిల్లర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను ఎక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సిద్దిపేటకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు గతంలో 1070 కోట్లు పనులు మంజూరు కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని కొడంగల్ కు తరలించకుపోవడం సిగ్గుచేటు అన్నారు నర్మెట్ట ఆయిల్ ఫామ్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని ముఖ్యమంత్రి మాట్లాడిన అబద్ధాలపై అంబేద్కర్ సర్కిల్లో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకొని రాజకీయాలు చేస్తున్నారని వీటిని మానుకోవాలని హితువు పలికారు. ఇప్పటికైనా సిద్దిపేట అభివృద్ధికి సహకరించి రద్దు చేసిన ఒక వెయ్యి 70 కోట్ల నిధులను విడుదల చేసి సిద్దిపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు మోహన్ లాల్, పూజల వెంకటేశ్వర్ రావు, ఆంజనేయులు, రెడ్డి ప్రభాకర్, మెరుగు మహేష్, అజిజ్, రాజేందర్, రామరాజు తదితరులు పాల్గొన్నారు..