ముద్ర, హుజూర్ నగర్ ప్రతినిధి: పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఈ విషయం తెలిసిన నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి దిగ్భ్రాంతి కి గురయ్యారు.మంగళవారం మంత్రి హుజూర్ నగర్ చేరుకొని మాజీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ పార్థివ దేహం పై మూడు రంగుల జెండా ఉంచి, పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ శ్రవణ్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్న రోజుల్లో ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేశారని, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ఈరోజు మనకు దూరం అవటం చాలా బాధాకరమని అన్నారు.శ్రవణ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.అదేవిధంగా వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, శ్రవణ్ కుమార్ పిల్లలకు విద్య అందించే బాధ్యత తీసుకుంటానని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.