Take a fresh look at your lifestyle.

గద్వాల ఎమ్మెల్యేను వెంటనే బర్తరప్ చేయాలి

 

 

జాబ్ క్యాలెండర్ బదులు దోపిడి క్యాలెండర్‌ అమలు పరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ముద్ర,‌ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతి నిధి:

పార్టీ ఫిరాయింపు కేసుల్లో గద్వాల ఎమ్మెల్యే‌ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ మారలేదని తీర్పు ఇచ్చారని, తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న బీఅర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, మరి గద్వాల ఎమ్మెల్యే  బండ్లను ఎందుకు సస్పెండ్ చేయలేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం బీఅర్ఎస్వీ నాయకులు కుర్వపల్లయ్య ఆధ్వర్యంలో బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు అధ్యక్షతన ఫీజు రీయింబర్స్ మెంట్ బజాయిల విడుదలకై మరియు ఉద్యోగాల భర్తి కై గద్వాలలో విద్యార్థుల, నిరుద్యోగు పోరు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల అవుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రూ.9,000 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేట్ కళాశాలల కు బకాయిలు చెల్లించనందున ఇంజనీరింగ్, వైద్య, టెక్నికల్ ఇతర కళాశాలలు మూసివేయడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. కళాశాలల యాజమాన్యం ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించిన బకాయిలు చెల్లించడం లేదన్నారు  విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించకపోతే గద్వాలలో జరిగిన పోరు దీక్ష రాష్ట్రమంతా పోరుబాటగా మారుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుల వేధింపులు తాళలేక, గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా, కలుషిత ఆహారం తినడం వలన రాష్ట్రంలో ఇప్పటికి 127 మంది విద్యార్థులు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అదే

ఇవ్వాళ రాష్ట్రంలో కేసిఆర్ సీఎంగా ఉంటే విద్యార్థులకు ఆ పరిస్థితి వచ్చేది కాదని, వ విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల కబ్జాలు అక్రమాలు పెరిగిపోయాయని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 900కోట్ల రూపాయాలతో దోపిడి చేసి కేరళలో ఎన్నికల ప్రచారానికి డబ్బులు తరలించారని, అదే డబ్బులతో‌‌ రాష్ట్ర ంలో నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని నమ్మబలికారు వాగ్దానాలతో నిరుద్యోగులను మభ్యపెట్టి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న నేటికీ 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడనే ఇక మిగిలిన రెండేళ్లలో ఎలా ఉద్యోగాలు ఇస్తాడని ప్రశ్నించారు.  ఇకనైనా నిరుద్యోగులు మేలుకోని పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. నడిగడ్డలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదొస్తామని , ఇప్పటికైనా మేల్కొని నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి,‌ రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. .ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు BRS పార్టీ పోరాటం ఆగదు అని ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటాం అని  హెచ్చరించారు.

 

*ఈ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గ ఇంచార్జి బాసు హన్మంతునాయుడు, మాజీ‌ జెడ్పీటిసి‌ పద్మా వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్‌కేశవ్, నాయకులు జీ.రాఘవేంద్ర రెడ్డి, చక్రధర్ రావు,‌‌ సూర్య గౌడ్, కోటేష్, మోనేష్, కౌన్సిలర్లు,‌ఐజ పట్టణ అధ్యక్షుడు మధు కుమార్, అలంపూర్ పట్టణాధ్యక్షుడు వెంకట రామయ్య శెట్టి, మైనారిటీ నాయకులు అతికూర్ రెహ్మాన్, గుమ్మ గోవర్ధన్, రంగస్వామి, పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు గడ్డం భరత్ బాబు, మల్దకల్, పైపాడు రాజు, గంజిపేట రాజు, ముని మౌర్య, గాజుల కృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, గోవిందు,మహేష్, నాయకులు, నిరుద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.