ముద్ర,వీపనగండ్ల : సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యకర్తలు అలుపెరుగని పోరాటాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. పార్టీ నూతన కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ జాన్ వెస్లీ ని వీపనగండ్ల మండలంలోని సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు హైదరాబాదులో పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వక కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి జాన్ వెస్లీ మాట్లాడుతూ ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి జాన్ వెస్లీ మాట్లాడుతూ ప్రజాకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తూ పార్టీని అన్ని రంగాలుగా బలోపేతం చేస్తు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే విధంగా పార్టీ నాయకత్వం సిద్ధం కావాలని అన్నారు.కార్యక్రమంలో సిపిఎం పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ సాగర్, ఎండి అబ్బాస్,మండల కార్యదర్శి బాల్ రెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల కృష్ణయ్య, మురళి, రవి ప్రసాద్, మండల నాయకులు ఆశన్న, వి కృష్ణయ్య, బాలగౌడు, నిరంజన్,సిహెచ్ వెంకటయ్య,రాములు,వెంకటేష్ గౌడ్,మౌలాలి, బాలస్వామి,లక్ష్మణ్, రామకృష్ణ,నవీన్, హుస్సన్న తదితరులు పాల్గొన్నారు.