- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి పూర్తిచేసేందుకు మిగిలిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ,భూ నిర్వాసితుల పునరావాస ఏర్పాట్ల పై ఇరిగేషన్,రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.బుద్ధారం పెద్ద చెరువు, గణప సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించిన భూసేకరణ పై ప్రధానంగా చర్చించారు.బుద్ధారం పెద్ద చెరువుకు సంబంధించిన 11.57 ఎకరాల భూమికి వారం రోజుల్లో అవార్డ్ పాస్ చేయాలని అనంతరం వెంటనే ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు.చెరువు లోపల అవసరమైన 205 ఎకరాల స్థలానికి సంబంధించి 109 ఎకరాలకు త్వరలో అవార్డ్ పాస్ చేయాలని మిగిలిన 96 ఎకరాలకు సర్వే చేయించాలని ఆర్డీఓ ను ఆదేశించారు. సర్వే అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.గణప సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించి సర్వే పూర్తి అయిన 18 ఎకరాలకు,మరో 388 ఎకరాల స్థలానికి అవార్డ్ పాస్ చేయించాలని,ఇరిగేషన్ శాఖ తరపున వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.మిగిలిన 197 ఎకరాలకు సర్వే చేయించాల్సిందిగా సూచించారు.భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటు వేగవంతంగా జరగాలని ఆదేశించారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు డి కేశవరావు మిగతా డీ.ఈలు తదితరులు పాల్గొన్నారు.