Take a fresh look at your lifestyle.

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభం; మట్టితో పేరుకుపోయిన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి సామర్ధ్యం పెంపు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభించాలి
నిధుల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెడుతా
కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం
బాక్రనంగల్ నుండి ఎస్.ఆర్ .ఎస్ పి వరకు అదే దుస్థితి
జాతీయ స్థాయిలో ఈ సమస్య అన్ని ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుంది
జాతీయ స్థాయి పూడికతీత విధానంలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పూడిక తీతకు శ్రీకారం
వర్షాకాలనికి ముందే పూడిక తీత పనులు పూర్తి చేయాలి
పూడిక తీత పూర్తిగా ఆధునిక పరిజ్ఞానంతోటే
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మట్టితో పేరుకుపోయిన సాగునీటి ప్రాజెక్టుల్లో రెండోదశ పూడిక తీత పనులకు వెంటనే శ్రీకారం చుట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందే పూడికతీత పనులు పూర్తి చేస్తే వర్షాకాలంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మట్టితో పూడిపోయిన ప్రాజెక్టుల్లో నీటి సామర్ధ్యం పూర్తిగా పడి పోవడంతో జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా పరిణమించిందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ఈ సంక్షోభం నుంచి బయటపడి రైతాంగానికి నీటి భద్రత కల్పించేందుకు కేంద్రం జాతీయస్థాయిలో తీసుకొచ్చిన పూడిక తీత విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పూడిక తీత పనులకు అంకురార్పణ చుట్టిందన్నారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మక బాక్ర నంగల్ నుండి తెలంగాణా రాష్ట్రంలో సుప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు మట్టితో పూడి పోయి నీటిసామర్ద్యం నిలువలు పడి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 120 టి.యం.సి ల సామర్ధ్యం నుండి ఏకంగా 80 టి.యం.సి లకు పడిపోయిందని గణాంకాలతో సహా వివరించారు. మట్టితో లేదా ఇసుక మేటలతో ప్రాజెక్టులు పడిపోయి నీటి సామర్ధ్యం నిలువలు ఘోరంగా పడిపోయాయన్నారు. ఇది జాతీయ స్థాయి సమస్యగా పరిణమించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటిదశ లో చేపట్టిన పూడిక తీత పనులు జాతీయస్థాయిలో పూడికతీతకై చేపట్టిన మార్గదర్శనంలొనే ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. పూడికతీత పనులకు అవసరమైన నిధుల సమీకరణ ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న పూడిక తీత పనులను ఆయన ప్రస్తావిస్తూ పైలెట్ ప్రాజెక్ట్ కింద “కడెం” ప్రాజెక్టులో మొదటి దశ లో చెపట్టి న పూడిక తీత విజయవంతం అయ్యిందన్నారు. ఇక్కడ పూర్తిగా అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో ఉండాల్సిన నీటి సామర్ధ్యం నిలువలు…వర్షాల ఉధృతికి వచ్చి చేరే నీటితో ఏర్పడ్డ నీటినిలువలు సమగ్రంగా అధ్యయనం జరిపి అంతిమ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సి రమేష్ బాబు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.