ముద్ర ,తాండూరు :
మున్సిపాలిటీలో గులాబీ పార్టీ దే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే
పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో 28 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తాండూరు పట్టణ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ఆయన స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి, ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్న తాండూరు పట్టణ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని, గత పాలనలో జరిగిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా 28 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. తాండూరు గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని స్పష్టం చేశారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.