- దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచిన జిహెచ్ఎంసి
- కేంద్రమంత్రి మనోహర్ హర్ కట్టర్.. జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్కు అవార్డు ప్రధానం
కుషాయిగూడ , ముద్ర విలేఖరి: స్వచ్ఛ సర్వేక్షన్ 2024-25 స్వచ్ఛ నగరంగా జిహెచ్ఎంసి దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. 10 లక్షల జనాభా కేటగిరిలో దేశవ్యాప్తంగా 20 నగరాలను ఎంపిక చేయగా, అందులో జిహెచ్ఎంసి ఆరవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక గురువారం ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల ప్రధానోత్సవం లో… కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ హల్ కట్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆరో స్థానంలో నిలిచిన జిహెచ్ఎంసి తరపున రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇల్లంబర్ది, కమిషనర్ ఆర్ వి కర్ణన్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, శానిటేషన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎస్ ఈ కోటేశ్వరరావు, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏ ఎస్ బి ఎం యశస్వి, సానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, ఎస్ ఎఫ్ ఏ ఊర్మిళ బృందం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ప్రజల సహకారంతోనే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును దక్కించుకున్నామని బృందం పేర్కొంది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులకు పలువురు అభినందనలు తెలిపారు.