Take a fresh look at your lifestyle.

ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించిన రాహుల్ శర్మ

  • శ్రీపాద వర్ధంతిలో భాగంగా సేవా కార్యక్రమం.

మహాదేవపూర్, ముద్ర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీపాదరావు ట్రస్ట్ సౌజన్యంతో పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు ట్రస్ట్ చైర్మన్ దుదిల్ల శ్రీనివాస్ బాబులు శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.శ్రీపాదన వర్ధంతి సందర్భంగా ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయటం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు.స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా కాటారం మండలంలో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేసినందుకు పుష్పగిరి ఆసుపత్రి యాజమాన్యనికి శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి కంటి పరీక్ష చేసుకోవాలని, చికిత్స అవసరం ఉన్న ప్రతి ఒకరికి ఉచితంగా వైద్య సేవలు అందించి కంటి అద్దాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.తమ కుటుంబంపై ప్రజలకున్న ప్రేమానురాగాలకు ఎల్లప్పుడూ సేవకులుగా ఉంటామన్నారు.భవిష్యత్తులో మరిన్ని పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలనుప్రజల కోసం కొనసాగించడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సమ్మయ్య, మహిళా నాయకురాలు జా డి రాజేశ్వరి పలు గ్రామాలకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.