Take a fresh look at your lifestyle.

అకాల వర్షాలకు తడిసి ముద్దైన వరి ధాన్యం

  • తడిసిన ధాన్యాన్ని కొనాలని,రోడ్డు ఎక్కిన రైతులు.

ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాత్రి కురిసిన అకాల వర్షాలకు వనపర్తి మార్కెట్ యార్డులోని వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ యార్డ్ ముందు కల రోడ్డు పై శనివారం రైతులు బైఠాయించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం వచ్చిన ధాన్యాన్ని గన్ని బ్యాగులు లేవని, ట్రాస్ఫోర్ట్ లేదని కొనుగోళ్లు చేయకపోవడం వల్ల 30వేల బస్తాలు నీటి పాలు అయినాయని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక పాము నష్టపోయామని ఆరోపించారు.రైతులు సుమారు గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి తమ నిరసన తెలిపారు.అక్కడికి చేరుకున్న తహసీల్దార్ తడసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు.

Leave A Reply

Your email address will not be published.