ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ, రిక్షా పుల్లర్స్ కాలనీ, పాపిరెడ్డి నగర్, మెడికల్ సొసైటీ కాలనీలలో రూ.1.16 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే యూజీడీ నిర్మాణం పనులకు మరియు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు జలమడలి అధికారులు మరియు తాజా మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అన్నారు. ఈనాడు కాలనీ, రిక్షా పుల్లర్స్ కాలనీ, పాపిరెడ్డి నగర్, మెడికల్ సొసైటీ కాలనీల లో గల ఎన్నో ఏండ్ల సమస్య నేటి శంకుస్థాపనలతో పరిష్కారం అవుతుందన్నారు. ఈనాడు కాలనీ లో రూ.39.80 లక్షలు, రిక్షా పుల్లర్స్ కాలనీ లో రూ.8.20 లక్షలు, పాపిరెడ్డి నగర్ కాలనీ లో రూ.21.00 లక్షలు, మెడికల్ సొసైటీ కాలనీ లో రూ.47.60 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే యూజీడీ నిర్మాణం పనులకు అరికపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, జిఎం హరిశంకర్, డిజిఎం శ్రీనివాసరాజు, మేనేజర్ అనిల్ మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.