Take a fresh look at your lifestyle.

10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 518 కేంద్రాలు ఏర్పాటు అదనపు కలెక్టర్ నగేష్

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 10 నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, ట్రాన్స్ పోర్ట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు, రైస్ మిల్లర్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ధాన్యం కొనుగోలు సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గన్ని బ్యాగులు, తూకం, టార్ఫాలిన్ కవర్లు, మొదలగు సామాగ్రి అందుబాటులో ఉండాలన్నారు.
రైస్ మిల్లు యజమానులు హమాలీని, రవాణా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రైస్ మిల్లులో అన్లోడింగ్ ప్రక్రియ త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్ యజమాన్యాలకు సూచించారు.
యాసంగి సీజన్ సిఎంఆర్ ను కూడా త్వరగా చేయాలని సూచించారు.
తూనికల కొలతల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లుల్లో ధాన్యం తూకం కొలతలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై అధికారి నిత్యానంద, ఫీల్డ్ సప్లై మేనేజర్ జగదీష్, జిల్లా కోపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, రైస్ మిల్లు యాజమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.