ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోనిబావిగిభద్రేశ్వరుని జాతర మహోత్సవంలో నిత్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన బీవీజీ ఫౌండేషన్ చైర్ పర్సన్ సునీత సంపత్ దంపతులు.ఈ కార్యక్రమంలో జాతర మహోత్సవ ఫెస్టివల్ చైర్మన్ మహేష్ మరియు కమిటీ సభ్యులు, వీరశైవ సమాజం పెద్దలు, అక్కమా దేవి భజన మండలి మహిళల సభ్యులు,వీరశైవ యువదల్ సభ్యులు పాల్గొని సునీత సంపత్ గారిని సన్మానించడం జరిగింది ,ఈ సందర్భంగా సునీత సంపత్ మాట్లాడుతూ జాతర మహోత్సవ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భద్రేశ్వరుని ఆశీర్వాదంతో తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న జాతర ఫెస్టివల్ కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.