Take a fresh look at your lifestyle.

బడ్జెట్ పెట్టేటప్పుడు ప్రతి అంశం ఉండేలా చూస్తున్న

ఆసిఫాబాద్ జిల్లా మోడీ జురి గ్రామ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

బడ్జెట్ పెట్టే సమయంలో తాను పాదయాత్రలో చూసిన, విన్న ప్రజల కష్టాలు తీరేలా ప్రతి అంశాన్ని చూసి పెడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా మోడీ జూరి గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆనాడు పాదయాత్ర సందర్భంగా మోడీ జురి గ్రామానికి చేరుకున్నాను. ఆరోజు ఉగాది పండుగ మూడు రోజులపాటు ఇక్కడే ఉన్నాను. ఏరువాక సందర్భంగా వెంకట్రావు పొలంలో అరకదున్నాను. ఎద్దులకు బెల్లం కొబ్బరి తినిపించాను. ఆ తర్వాత లక్ష్మణరావు పటేల్ ఇంట్లో అందరం కలిసి గుగ్గిల్లి తిన్నాం ఆ తర్వాత భోజనం చేశామని గుర్తు చేసుకున్నారు. తాను పాదయాత్ర చేసిన గ్రామాలు, మనుషులు, సమస్యలు ఏ ఒక్కటి మర్చిపోలేదని తెలిపారు. అందులో భాగంగానే మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు పడొద్దని ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని తీసుకువచ్చాం, ప్రతి వారంలో రెండు రోజులు విద్యుత్ అధికారులు పొలం బాట ప్రజా బాట పేరిట విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. నేను ఆనాడు చూసిన పిల్లలు వారే కదా మన భవిష్యత్తు అనుకున్న అందుకే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ప్రపంచ స్థాయి లో మన పిల్లలు పోటీపడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా ఐటీడీఏ లను బలోపేతం చేసేందుకు ఎస్టీ సబ్ ప్లాన్ కింద 17 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళలు బట్టలు కొనుగోలుకు పడే ఇబ్బందులను గుర్తించి నాణ్యమైన చీరలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. దొడ్డు బియ్యం పురుగులతో ఉన్నాయని ఆనాడు సమస్య వివరించగా ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు. ఇవన్నీ కూడా ఆనాడు ప్రజలు చెప్పిన సమస్యలకు సమాధానాలు అని గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.