ముద్ర, ప్రతినిధి, నిర్మల్:
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టాలని అధికార పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంకటాపూర్ వార్డులో ఆయన మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి తో కలిసి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నిర్మల్ పురపాలక సంఘంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన కోరారు.