Take a fresh look at your lifestyle.

వైద్యం, విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట: బండి రమేష్

తేనగర్‌లో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్

ముద్ర,కూకట్‌పల్లి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్‌లో వినయ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలను ఒకే చోట, ఉచితంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ముదావహమన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని శిబిరాలు:
పార్టీ శ్రేణులు చొరవ తీసుకుని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇటువంటి ఆరోగ్య శిబిరాలను తరచుగా నిర్వహించాలని బండి రమేష్ పిలుపునిచ్చారు. దీనివల్ల పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావడమే కాకుండా, పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య, కుక్కల రమేష్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, మేకల రమేష్, కొప్పిశెట్టి దినేష్ కుమార్, గంధం రాజు, మధురి రాము, రాజ్ పటేల్, మధు గౌడ్, అయాజ్, జ్యోతి మరియు పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.