Take a fresh look at your lifestyle.

క్రీడా స్ఫూర్తి తో పోలీస్ క్రీడల ముగింపు ఉత్సవం

క్రీడా స్ఫూర్తి తో పోలీస్ క్రీడల ముగింపు ఉత్సవం:

ముఖ్య అతిథి విచ్చేసిన ఎస్ఏటీజీ వీసీ, ఎండీ డా. ఎ. సోనీబాలదేవి
– క్రీడా స్ఫూర్తికి నిదర్శనం: సీపీ డాక్టర్ ఎం. రమేష్*
* 33 జిల్లాల నుండి 2,532 మంది క్రీడాకారులు..
ముద్ర, శేరిలింగంపల్లి :
పోలీసు సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతూ, క్రమశిక్షణకు నిలువుటద్దంగా నిలిచిన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 శనివారం ఘనంగా ముగిసింది. గడిచిన కొద్దిరోజులుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో హోరాహోరీగా సాగిన ఈ క్రీడోత్సవాలు, వందలాది మంది క్రీడాకారుల భాగస్వామ్యంతో వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎ స్ఏటీజీ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనిబాలా దేవి, సంజయ్ కుమార్ జైన్, ఏడి‌జి‌పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ముందుగా గౌరవ వందనం స్వీకరించారు.

టగ్ ఆఫ్ వార్’ మహిళల విభాగంలో పోటీలు అత్యంత ఉత్సాహంగా, హోరాహోరీగా సాగాయి. మల్కాజ్ గిరి, హైదరాబాద్ కమిషనరేట్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో మల్కాజ్గిరి జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, హైదరాబాద్ జట్టు ద్వితీయ స్థానంలో, సైబరాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే, పురుషుల విభాగంలో టీ. జి. ఎస్. పి -I మరియు టి. జి. ఎస్. పి -II జట్ల మధ్య జరిగిన పోటీలో I విజేతగా నిలిచింది.
పోలీసు సేవలు ఆదర్శనీయం: శాట్స్ వైస్ ఛైర్మన్, ఎండీ డా. ఎ. సోనిబాలా దేవి
పోలీసు కుటుంబం నుండి వచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. సమాజం సురక్షితంగా ఉండటం కోసం పోలీసులు పడే శ్రమను నేను దగ్గర నుండి చూశాను. పౌరుల క్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ, క్రమశిక్షణ మరియు బాధ్యతతో వ్యవహరించే పోలీసు దళానికి నా సెల్యూట్. మనస్సాక్షిని అనుసరించి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. అన్నారు. సమాజ భద్రతలో పోలీసుల సేవలు ఆదర్శవంతమైనవని కొనియాడారు. వృత్తిరిత్యా ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు అద్భుతమైన సాధనాలు. ఇవి శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక స్థైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర కీర్తిని చాటాలి” అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజేతలకు ఆమె పతకాలు, ట్రోఫీలను అందజేశారు.

క్రీడా స్ఫూర్తికి నిదర్శనం: సీపీ డాక్టర్ ఎం. రమేష్*
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ క్రీడలు మనందరిలో చెరగని జ్ఞాపకాలను మిగిల్చాయని కొనియాడారు. తాను స్వయంగా కొన్ని పోటీలను వీక్షించానని, క్రీడాకారులు ప్రదర్శించిన అద్భుతమైన పోటీ తత్వం, గెలుపోటములను సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తి మరియు తోటి సోదర భావం తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలుపుతూనే, పట్టుదలతో ఆడి తమ ప్రతిభను చాటిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్‌కు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 2,532 మంది క్రీడాకారులు పాల్గొనడం ఈ స్పోర్ట్స్ మీట్ విజయానికి నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఇందులో 300 మంది మహిళా క్రీడాకారులు ఉండటం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలు, కమిషనరేట్లు, స్పెషల్ ఫోర్సెస్ నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం వల్ల సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్ మరియు పరస్పర సహకార భావం పెరుగుతాయని, ఇటువంటి క్రీడలు పోలీస్ శాఖలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహణలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ క్రీడా మహోత్సవం విజయవంతం కావడానికి ముందుండి నడిపించిన స్పోర్ట్స్ ఐజీ డా. గజరావు భూపాల్ గారికి, తెలంగాణ డీజీపీ కార్యాలయ సిబ్బందికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమ రూపకర్తలు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అడిషనల్ డీసీపీ షమీర్, సమన్వయకర్తలుగా వ్యవహరించిన డీసీపీలు, ఏసీపీల కృషిని అభినందించారు. ముఖ్యంగా ఈ ఈవెంట్‌ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ఈవెంట్ మేనేజర్లకు, చివరి నిమిషంలో కూడా ఎటువంటి లోటు రాకుండా మెమెంటోలు, పతకాలు, ఇతర ఏర్పాట్లను అద్భుతంగా సమకూర్చిన కళాధర్ కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. “జై హింద్.. జై తెలంగాణ.. జై పోలీస్!” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

జాతీయ స్థాయికి బాటలు: పీ అండ్ ఎల్, స్పోర్ట్స్ ఐజీ గజరావు భూపాల్
ముగింపు ప్రసంగంలో స్పోర్ట్స్ ఐజీ డా. గజరావు భూపాల్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందిలో ఆరోగ్యం పట్ల అవగాహన్, క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే ఈ క్రీడోత్సవాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ పోటీల్లో కనబరిచిన ప్రతిభ ద్వారా తెలంగాణ పోలీసులు జాతీయ వేదికలపై సత్తా చాటగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో జోగులాంబ, చార్మినార్, యాదాద్రి, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, కాళేశ్వరం జోన్లు, హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, మల్కాజిగిరి కమిషనరేట్లు, టి. జి. ఎస్. పి -I, ti. జి. ఎస్. పి -II, ఈగిల్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఐటీ & కమ్యూనికేషన్, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు టి. జి. పి. ఎ విభాగాలు పాల్గొన్నాయన్నారు.

వెల్నెస్ ఎక్స్ పోకు విశేష స్పందన..
క్రీడలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘పోలీస్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ ఎక్స్ పో’ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుందన్నారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఏర్పాటు చేసిన న్యూట్రిషన్, టెక్నాలజీ, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ స్టాళ్లను సిబ్బంది సద్వినియోగం చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎక్స్ పో నిర్వాహకులకు మెమెంటోలు అందజేశారు.

విజేతలకు శాట్స్ వైస్ ఛైర్మన్, ఎండీ డా. ఎ. సోనిబాలా దేవి, బాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ బహుమతులు అందజేశారు.

కన్నుల పండువగా రిట్రీట్..
ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన రిట్రీట్ సెరిమనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోల్కొండ ఆర్మీ రెజిమెంట్ పైప్ బ్యాండ్ అందించిన మధుర స్వరాలు క్రీడాకారుల్లో జోష్ నింపాయి. రాష్ట్ర పోలీస్ జెండాను గౌరవపూర్వకంగా ముఖ్య అతిథికి అందజేశారు. అనంతరం ఆ జెండాను స్పోర్ట్స్ ఐజీకి అప్పగించారు. “హిప్ హిప్ హుర్రే” నినాదాలు, ఆకాశంలో మెరిసిన బాణసంచా వెలుగుల మధ్య క్రీడోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్ జైన్, ఏడి‌జి‌పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్లు; డాక్టర్ గజరావు భూపాల్, ఐజీ, పీ& ఎల్, స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌; సైబరాబాద్ డి‌సి‌పిలు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్,., కుత్భుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి., శేరిలింగంపల్లి డీసీపీ సి. హెచ్. శ్రీనివాస్, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, డబ్ల్యూ అండ్ సీఎస్ డబ్ల్యూ డీసీపీ సృజన కరణం, సైబరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, డీసీపీ ట్రాఫిక్-I – రంజన్ రతన్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ ట్రాఫిక్-II – ఎస్. శేషాద్రిని రెడ్డి, ఎన్ పెద్దబాబు 15 వ బెటాలియన్ కమాండెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.