Take a fresh look at your lifestyle.

అందగత్తెల సందడి

  • చారిత్రాత్మక చార్మినార్ వీధుల్లో వేడుకగా హెరిటేజ్ వాక్.
  • చుడీ బజర్‌లో షాపింగ్ చేసిన సుందరీమణులు.
  • చార్మినార్ అందాలకు ఫిదా అయిన సుందరీమణులు.
  • చుడీ బజార్ వ్యాపారుల ఉదారత.

ముద్ర, తెలంగాణ బ్యూరో : మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ పాతబస్తీలో సందడి చేశారు.చారిత్రాత్మక చార్మినార్ అందాలు, చౌమల్లా ప్యాలెస్‌లో విందు, మక్కా మసీద్, బదాహి అఘార్ ఖానా, ఖిల్వతా ముబారక్, చుడి బజార్‌లో షాపింగ్ చేసిన సుందరీమణులు ఫిదా అయ్యారు.ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న గైడ్‌లు వారికి ప్రతి కట్టడానికి సంబంధించిన చరిత్ర, శిల్పకళా విశేషాలను వివరించారు.మంగళవారం చారిత్రాత్మక చార్మినార్ వద్దకు వచ్చిన 109 దేశాల అందగత్తెలకు రెడ్ కార్పెట్‌తో సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మర్పా వాయిద్యాలకు అనుగుణంగా ప్రపంచ అందగత్తెలు స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.చార్మినార్ వేదిక నుంచి ప్రజలకు అభివాదం తెలియజేశారు.హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ సంస్ధ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు వేడుకగా జరిగిన ”హెరిటేజ్ వాక్” లో సుందరీమణుల పాల్గొన్నారు.చార్మినార్ అందాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ సెల్ ఫోన్లలో బందించుకున్నారు. చార్మినార్ వద్ద అందగత్తెలు గ్రూప్ ఫోటో దిగారు.చుడీ బజార్‌ (లాడ్ బజార్)లో ఎంపిక చేసిన తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో సుందరీమణులు షాపింగ్ చేశారు. తెలంగాణ సంప్రదాయ గాజులు, ముత్యాల హారాలు సహా అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు. అక్కడే గాజుల తయారీ విధానాన్ని కూడా స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిపుణులైన కారిగర్లు (కాళాకారులు), శిల్పులను అభినందించారు. చౌహముల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అందగత్తెలు పాల్గొన్నారు. అక్కడే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెహందీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. చౌముల్లా ప్యాలెస్‌లో నిజామ్ రాజుల కాలంలో ఉపయోగించిన యుద్ద ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, పాతబస్తీ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనను వారు తిలికించి, చరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు.మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హైదరాబాద్ పాతబస్తీ సందర్శన కేవలం పోటీలలో భాగంగానే కాకుండా, ప్రపంచ శాంతి, సాంస్కృతిక సామరస్యానికి సాక్ష్యంగా నిలవడం గమనార్హం.

  • చుడీ బజార్ వ్యాపారులు ఉదారత.

ప్రపంచ సుందరీమణుల షాపింగ్ సందర్భంగా చుడీ బజార్ వ్యాపారులు ఉదారత చూపించారు. తమ షాపుల్లోకి వచ్చిన వారికి గులాబీ పూలు ఇచ్చి అహ్వానించారు వ్యాపారులు.మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కొన్న వస్తువులకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే అందజేసి ఉదారతను ప్రదర్శించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ చుడీ బజార్ ప్రత్యేకతలను ప్రపంచ వ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను వ్యాపారులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.