బాలీవుడ్ సంక్షోభంలో ఉన్న వేళ, అంచనాలు లేకుండా వచ్చి ₹1000 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్’కు సీక్వెల్ ఇది. మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా డ్యాన్స్, రణ్‌వీర్ యాక్షన్ సంచలనం సృష్టించగా, ఈ రెండో భాగం ఆ ఇంటెన్సిటీని కొనసాగించిందా లేదా చూద్దాం.
కథా సారాంశం
మొదటి భాగంలో పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ రెహ్మాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా)ను అంతం చేసిన అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) ప్రయాణం ఇందులో కొనసాగుతుంది. అసలు జస్కిరత్ సింగ్ రంగి ఎవరు? అతను హంజాగా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే ఫ్లాష్‌బ్యాక్ ఈ సినిమాకు హైలైట్. కరాచీలో పాగా వేసి, ఐయస్ఐ కుట్రలను ఛేదిస్తూ, 26/11 సూత్రధారులను ఏరిపారేయడమే లక్ష్యంగా సాగే హంజా పోరాటమే ఈ చిత్రం. ఇందులో ఎస్పీ అస్లాం (సంజయ్ దత్), మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)తో సాగే మైండ్ గేమ్ ఉత్కంఠను పెంచుతుంది.
విశ్లేషణ
దర్శకత్వం: ఆదిత్య ధర్ తన మార్క్ ‘రా & రియలిస్టిక్’ మేకింగ్‌తో మెప్పించారు. 3 గంటల 49 నిమిషాల నిడివి ఉన్నా, చాప్టర్ వైజ్ కథనం బోర్ కొట్టించదు.
హైలైట్స్: హంజా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. దేశ భద్రత కోసం హీరో చేసే రిస్కీ ఆపరేషన్లు, డీమానిటైజేషన్ కోణాన్ని చర్చించడం సినిమాకు బలాన్నిచ్చాయి.
సాంకేతికత: శాస్వత్ సచ్‌దేవ్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. వికాస్ సినిమాటోగ్రఫీ పాకిస్తాన్ అండర్ వరల్డ్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది.
నటన: రణ్‌వీర్ సింగ్ ‘బీస్ట్ మోడ్’ పర్ఫామెన్స్‌తో ఇరగదీశారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్
1. రణ్‌వీర్ సింగ్ నటన2. డైరెక్షన్3. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,
4. సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
1. ప్రథమార్థంలో కొన్ని సాగతీత సన్నివేశాలు.
2. మితిమీరిన హింస
రేటింగ్: 3/5
చివరి మాట: మాస్ యాక్షన్ ప్రియులకు ఇది పక్కా ‘పైసా వసూల్’ మూవీ!
– నరేష్ , ముద్ర .