Take a fresh look at your lifestyle.

న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిది వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్

ముద్ర, వనపర్తి :
న్యాయవాదులకు రక్షణ చట్టం కవచం లాంటిదని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘ భవనం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం అభినందనీయమని ఆయన అన్నారు, న్యాయ వాదులు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం అందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి లకు వనపర్తి బార్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన అన్నారు, న్యాయవాదులపై వరుస దాడులు జరుగు తున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును బిల్లును ప్రవేశపెట్టడం సంతోషకరమని అందరూ న్యాయవాదులకు ఇది శుభపరిణామం అని అన్నారు,న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని అలంపూర్ బార్ సోసియేషన్ నుంచి న్యాయవాదులు పాదయాత్ర చేపడితే వారికి మద్దతుగా వనపర్తి న్యాయ వాదులు సంఘీభావం తెలిపి కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు, న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు వచ్చి రక్షణ చట్టంతో పాటు మరికొన్ని వసతులను కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు, న్యాయవాదులకు రక్షణ చట్టం ఎంతగానో పనిచేస్తుందని అదే సమయంలో న్యాయవాదులు కూడా తప్పుగా వ్యవహరించ కూడదని సూచించారు, బిల్లుతోపాటు న్యాయవాదుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు, అందరు న్యాయవాదుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు, ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మోహన్ గౌడ్, నాగేశ్వర్ లు మాట్లాడుతూ న్యాయవాదుల చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని సూచించారు, చట్టం ఉంది కదా అని న్యాయవాదులు కూడా తప్పుగా ప్రవర్తించొద్దని గుర్తు చేశారు, అనంతరం స్వీట్లను పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు, కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ వెంకటరమణ, న్యాయ వాదులు మోహన్ కుమార్, తిరుపతయ్య గౌడ్, పురుషోత్తం, కొండా విజయభాస్కర్, షాకీర్ హుస్సేన్, భరత్ కుమార్ శ్రీనివాసులు, వేంకటాద్రి, ఫజల్,బాబా, తిరుపతయ్య, త్రినాథ్ జూనియర్ న్యాయ వదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.