Take a fresh look at your lifestyle.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర ఉప కార్యదర్శి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

మండలంలోని హన్మపూర్, తాజ్‌పూర్ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పలు అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఉప కార్యదర్శి డాక్టర్ మూనా యాస్మిన్ మంగళవారం పర్యటించి పరిశీలించారు.


హన్మపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ కుంట (వాటర్ హార్వెస్టింగ్ పొండ్), నర్సరీ పనులు, అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను సందర్శించి పనుల నాణ్యత, నిర్వహణ విధానం, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను పరిశీలించారు.
అనంతరం తాజ్‌పూర్ గ్రామంలో వాగు సమీపంలోని డ్రైనేజ్ లైన్ చివర ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత పనులను పరిశీలించి, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల దిశగా చేపడుతున్న చర్యలను అభినందించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, కలుగుతున్న ప్రయోజనాల గురించి వివరంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, జంగా రెడ్డి, నవీన్, తాజ్‌పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, హన్మపూర్ సర్పంచ్ నాయిని సువర్ణ కృష్ణ, ఎంపీడీఓ భాస్కర్, ఉపాధి హామీ, సెర్ప్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.