Take a fresh look at your lifestyle.

కరాటే లో రాష్ట్ర స్థాయి బహుమతులు పొందిన ఎన్నారం పాఠశాల విద్యార్థులు

ముద్ర, రామన్నపేట : 
మండలంలోని ఎన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలాలో ప్రథమ గోల్డ్ మెడల్, ద్వితీయ సిల్వర్ మెడల్, తృతీయ రజత పతకాలు సాధించారు.
జిల్లా కేంద్రంలో జరిగిన కరాటే పోటీలలో పాఠశాల విద్యార్థులు సల్ల వరూదిని 7వ తరగతి ప్రథమ బహుమతి, శ్రీరాముల చందు 8వ తరగతి ద్వితీయ బహుమతి,
మోక్షిత్, మణి తేజ, అమృత 7వ తరగతి రమాదేవి, శరణ్య 9వ తరగతి వారికి తృతీయ బహుమతులు, సర్టిఫికెట్స్ అందుకున్నారు. వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమలాదేవి అభినందించారు. ఎస్కార్ట్ టీచర్ రమాబాయి, మాస్టర్ ప్రసాద్, వీరికి ప్రేరణగా ధాతలుగా వ్యవహరించిన భాస్కర్ రెడ్డి, కొండూరు శంకర్, కమలాదేవి, నీలం శేఖర్, బుచ్చి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.