Take a fresh look at your lifestyle.

*రైతును రాజు చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామెల్

 

 
ముద్ర, తుంగతుర్తి:

ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు- మార్కెటింగ్ శాఖ ప్రగతి నివేదిక కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల పక్షపాత ప్రభుత్వ నడుస్తుందని అన్నారు. రూ. లక్ష రుణమాఫీ చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్లు పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి వేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తూ.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. సమావేశానికి ముందు జాతీయ గీతాలాపన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ రంగంలో నూతన పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేశారు అలాగే వ్యవసాయంలో ఏ పంటలు ఏ వాతావరణంలో పండించాలో అలాగే రైతు బీమా సబ్సిడీ పథకాలు పంట రుణాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండలాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ,తుంగతుర్తి, మద్దిరాల,నూతనకల్, తహసిల్దార్ లు దయానందం, సబిత, నూతనకల్ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడిఏ రమేష్ బాబు, మార్కెట్ కమిటీ కార్యదర్శి సురేష్ కుమార్,ఏఈఓ లు, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా,తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి, పచ్చిపాల వెంకన్న, నల్లు రామచంద్రారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.