* పార్లమెంట్‌లో గళం విప్పిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కేవలం గిరిజనులపై చేసిన మోసం మాత్రమే, నిజమైన అభివృద్ధి కాదని పెద్దపల్లి ఎంపి వంశీ కృష్ణ అన్నారు. పార్లమెంట్ లో మంగళవారం పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. తాను స్థిరత్వానికి పెద్ద మద్దతుదారుడిని అయినప్పటికీ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంధన్నారు . పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం లలో కొత్త విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి స్థానికంగా నష్టపోయిన వారికి మినహాయింపు వర్తింపజేయకపోవడమే, భారీ విద్యుత్ నష్టాలను కలిగిస్తుందని వివరించారు. భూమి కోల్పోయిన వారికి RNR ప్యాకేజీ కింద ఏదోవిధంగా సహాయం అందించాలని కొరారు. రామగుండం లోని మాతంగి కాలని తీవ్రంగా నష్టపోతుందని, అలాగే రామగుండం ప్రాంతాలకు ఎన్.టి.పి.సి. హక్కులు అందించబడాలని డిమాండ్ చేశారు , పెద్దపల్లి మరియు రామగుండం ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించబడాలని డిమాండ్ చేసారు.