యైటింక్లయిన్ కాలనీ,ముద్ర: సింగరేణి కంపెనీ లో మహిళా ఉద్యోగులను సైతం రెస్క్యూ సభ్యులుగా శిక్షణ ఇచ్చేందుకు యాజమాన్యం చేస్తున్న యోచనకు అనుగుణంగా అండర్ మేనేజర్ అంబటి మౌనిక నేడు రెస్క్యూ జట్టులో చేరి తొలి మహిళ ఉద్యోగి గా నిలిచింది.ఈ మేరకు ఇటీవలే అండర్ మేనేజర్ ఉద్యోగంలో చేరి కొత్తగూడెం రీజియన్ లోని పి.వి.కే 5వ గనిలో విధులు నిర్వహిస్తున్న అంబటి మౌనిక తొలి మహిళా రెస్క్యూ టీంలో సభ్యులు గా చేరారు.హెచ్.జడ్.ఎల్ కంపెనిలో ఉద్యోగం చేస్తున్న కాలంలో రెస్క్యూ లో శిక్షణా పొందిన మౌనిక మంగళవారం సింగరేణి రామగుండం రీజియన్ రెస్క్యూ స్టేషన్ లో రెస్క్యూ సభ్యురాలిగా చేరింది.ఇక్కడికి వచ్చిన మౌనిక ను రెస్క్యూ స్టేషన్ సూపరిండెంట్ మాధవరావు, అడిషనల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించి, రెస్క్యూ యూనిఫాం,రెస్క్యూ కిట్లను అందజేశారు.యూనిఫాం, రెస్క్యూ కీట్లను ధరించి ఆమె రీఫ్రెషర్ సాధన ను ప్రారంభించింది.
