Take a fresh look at your lifestyle.

విద్యుత్ ఇబ్బందులు రావొద్దు 

  • క్రిటికల్ ఫీడర్లు, డీటీఆర్ లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
  • 33 కేవీ, ఎల్ టి నెట్‌వర్క్ టిజి ఎయిమ్స్ సర్వే చేపట్టాలి.
  • ఎస్ ఇలు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో తనిఖీ లు నిర్వహించాలి.
  • అధికారులకు విద్యుత్ సంస్థ సిఎండి  ముషారఫ్ ఫరూఖీ ఆదేశం.   
ముద్ర, తెలంగాణ బ్యూరో: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా  సంబంధిత అధికారులు,సిబ్బంది ఎప్పటికప్పుడు తగు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు.ఈ మేరకు సోమవారం మింట్ కాంపౌండ్ లోని ప్రధాన కార్యలయం నుండి చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూపరింటెండెంట్ ఇంజినీర్లు తమ పరిధిలోని ఫీడర్లలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. వారాని ఒకసారి సంబంధిత అధికారులతో సమీక్ష చేయాలన్నారు.అత్యధికంగా అంతరాయాలు నమోదైన ఫీడర్ల పై ప్రత్యేక దృష్టి సారించి, లైన్ల, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల, ఎబి స్విచ్ లను తనిఖీలు చేపట్టాలన్నారు. సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఫీడర్ల అంతరాయాలకు గల కారణాల్లో అధిక శాతం చెట్ల కొమ్మలు విద్యుత్ తీగల పై పడటం తాకడం మూలంగా నే ట్రిప్ అవుతున్నాయన్నారు. అందువల్ల క్షేత్ర స్థాయి సిబ్బంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో విధిగా పెట్రోలింగ్ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే, వర్షాలు కురిసేటప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికల సమయంలో సిబ్బంది తమ తమ కార్యాలయాల్లో నిత్యం  అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణంగా స్పందించి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఎఫ్ఒసి పరిధిలో ఉండే ఆటోలకు జీపీఎస్S సాంకేతికను అమర్చడం జరిగిందన్నారు.ఈ సదుపాయం వలన ఫిర్యాదుదారుడి ప్రాంగణానికి త్వరితగతిన చేరే అవకాశముంటున్నారు. గతం లో 11 కెవి నెట్‌వర్క్ పై నిర్వహించిన ఎయిమ్స్  (టిజి ఎయిమ్స్)S సర్వే సత్పలితాలను ఇస్తున్నదన్నారు.ఈ సర్వే ద్వారా విద్యుత్ స్తంభాల, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లు ఇతర నెట్‌వర్క్ మాఫింగ్ విజయవంతంగా పూర్తి అయిందన్నారు. దీనిని 33 కెవి నెట్‌వర్క్, ఎల్ టి స్థాయిలో కూడా సర్వే చేపట్టాలని సీఎండీ అధికారులను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎండీ తో పాటు, సంస్థ ఇన్ ఛార్జి డైరెక్టర్ లు నర్సింహులు, సాయి బాబా, చీఫ్ ఇంజినీర్లు  చక్రపాణి, పాండ్య,  కామేష్,  బాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.